డ‌బ్బింగ్‌కు 46రోజులు ప‌ట్టింది!


గ‌జిని చిత్రంతో తెలుగు తెర‌పై మంచి గుర్తింపు తెచ్చుకుని, సింగ‌మ్ సిరీస్‌తో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్న న‌టుడు సూర్య‌. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తిసురేష్ క‌థానాయిక‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ’’
* ‘‘చాలా రోజుల త‌ర్వాత నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా ‘గ్యాంగ్‌’. కొత్తదనానికి కమర్షియల్‌ అంశాల్ని జోడించాం. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’కి ఇది రీమేక్‌. కానీ క‌థ‌లోని మూలం దెబ్బ తిన‌కుండా చాలా మార్పులు చేశాం. ఇందులోని అంశాలు కొత్త‌గా ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాం. విఘ్నేష్ శివ‌న్ సినిమాను తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ’’
* ‘‘1980లో జరిగిన పెద్ద దోపిడికి సంబందించిన నిజమైన సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించాం. అంతేగాక అది దేశంలోనే పెద్ద సమస్యగా మారింది ఇందులో దాన్ని కూడా టచ్ చేశారు.’’
* ‘‘కార్తీక్‌, రమ్యకృష్ణలాంటి గొప్ప న‌టుల‌తో కలసి పనిచేయడం ఆనందంగా ఉంది. కార్తీక్ స‌ర్ నాలుగు నిమిషాల స‌న్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేసేశారు. ఇక ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు సెంథిల్‌తో ప‌నిచేయ‌డంతో మ‌రో కొత్త అనుభూతి అనే చెప్పాలి. ’’
* ‘‘కొత్తదనానికి దూరం అవుతున్నానేమో అనే నాలోని భావనను ‘గ్యాంగ్‌’ తొల‌గించింది. నేను సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఉన్నానో, ఎలా మాట్లాడేవాడినో ఈ సినిమా గుర్తు చేసింది.’’
* ‘‘ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకొన్నా. ఎందుకంటే ఇందులో నా డైలాగులన్నీ ఓ కొత్త పంథాలో ఉంటాయి. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు చాలా ఆస్వాదించా. ‘సుందర తెలుగు’ అని ఎందుకు అంటారో అర్థమైంది. తెలుగు భాష గొప్పదనం తెలిసింది. త‌మిళంలో డ‌బ్బింగ్ చెప్ప‌టానికి 8 రోజులు స‌మ‌యం ప‌డితే.. తెలుగులో మాత్రం 46రోజులు ప‌ట్టింది. భ‌విష్య‌త్‌లో ఇంకా బాగా తెలుగు నేర్చుకుంటా.’’
* ‘‘సంక్రాంతికి అజ్ఞాత‌వాసి, జైసింహా చిత్రాలు విడుద‌ల‌వుతున్నా, పండుగ సీజన్ కాబట్టి పెద్ద ఇబ్బందేం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణగారు ఇక్కడ పెద్ద హీరోలు. అయినా ‘అజ్ఞాతవాసి’ 10న వస్తే నా సినిమా 12న వస్తోంది.’’
* ‘‘రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ రాక తమిళ రాజకీయాల్లో గొప్ప మార్పుని తీసుకొస్తుందని భావిస్తున్నా. సినిమా గ్లామర్‌మీదే ఓట్లు రావు. కానీ... మార్పు కోసం శ్రమిస్తున్నారు. నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. ప్రజలకు సేవ చేయాలంటే ఏ రూపంలోనైనా చేయొచ్చు. విద్యాదానం మహా గొప్పది. ఆ రూపంలో పదిమందికీ సేవ చేయడానికి మా ట్రస్టు పనిచేస్తోంది’’
* ‘‘ఈ సినిమా త‌ర్వాత సెల్వ రాఘవన్ తో ఒక సినిమా చేస్తున్నాను. అందులో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ క‌థానాయిక‌లు. ఆ తర్వాత కె.వి. ఆనంద్ తో ఒక సినిమా చేస్తాను.’’

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com