మా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..


ఓ సెలబ్రిటీ గురించి వివరించాలంటే.. ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త..అని సంబోధిస్తుంటారు. తమ అభిమాన సెలబ్రిటీల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని కోరుకోని అభిమానులు ఉండరు. ఎలాంటి దుస్తులు ఇష్టపడతారు, ఇష్టమైన పెర్‌ఫ్యూమ్‌లేంటి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అందుకే..నటీనటుల ఇంటర్వ్యూలు తీసుకునేటప్పుడు వారి ఇష్టాయిష్టాల గురించి ప్రత్యేకంగా రాస్తుంటారు. కానీ, సామాజిక మాధ్యమాలు వచ్చాక తమకు నచ్చిన ఆహారం ఇది, ఇష్టమైన దుస్తులు ఇవి అంటూ ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేసేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. సెలబ్రిటీలు తమ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే వారి ట్విటర్‌ ఖాతాల్లో పేర్కొనే బయో చూస్తే చాలు..

అలాంటి కొన్ని సెలబ్రిటీ బయోలు చూస్తే..

* అమితాబ్‌ బచ్చన్: యాక్టర్‌..కనీసం కొందరైనా నన్ను ఇంకా యాక్టర్‌గా సంబోధిస్తున్నారు.

* కమల్‌ హాసన్‌: యాక్టర్, దర్శకుడు, డ్యాన్సర్‌, రైటర్‌, నిర్మాత

* మహేశ్‌బాబు: తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టర్‌

* అల్లు అర్జున్‌: సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌

* రవితేజ: శాశ్వతంగా జీవిస్తున్నట్లు కలలు కనండి. ఈరోజే చివరి రోజు అన్నట్లు జీవించండి.



* కాజల్‌ అగర్వాల్‌: యాక్టర్‌. ఎంట్రప్రెన్యూర్‌. ‘మర్సాలా’ సహవ్యవస్థాపకురాలు. డ్రీమర్‌. ట్రావెలర్‌. ఫుడీ

* అఖిల్‌ అక్కినేని: యాక్టర్‌..కనీసం ఆ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. రేపటి కోసం మెరుగైన ప్రయత్నాలు చేస్తున్నాను. మిమ్మల్ని సినిమాల వద్ద కలుస్తాను.

* లావణ్య త్రిపాఠి: అందమైన ముఖం కంటే ఇంకా చాలానే ఉంది.

* నాని: A-R-T-I-S-T

* రకుల్‌ ప్రీత్‌ సింగ్‌: యాక్టర్‌! కలల్ని నిజం చేసుకునే ప్రక్రియలో ఉన్నాను.

* ప్రియాంక చోప్రా: డ్రీమర్‌..ఎచీవర్‌

* పవన్‌ కల్యాణ్‌: జై హింద్‌!

* తమన్నా: డ్రీమర్‌..నా హృదయాన్ని అనుసరిస్తున్నాను.

ఇక సమంత, మామయ్య నాగార్జునలది ఒకే ట్విటర్‌ బయో. వారి బయోల్లో ‘యాక్టర్‌’ అని ఉంటుంది. ఎన్టీఆర్‌ కూడా తన బయోలో యాక్టర్‌ అనే పేర్కొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com