ఆన్‌లైన్‌ అమ్మకాలపై పతంజలి దృష్టి


బాబా రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ తయారు చేస్తున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోనూ విరివిగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు తమ సొంతపోర్టల్‌ ‌www.patanjaliayurved.net లో సంస్థ ఉత్పత్తులు లభిస్తున్నాయి. అత్యధికులకు చేరువయ్యేందుకు, 8 అగ్రశ్రేణి ఇ కామర్స్‌ పోర్టళ్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, 1ఎంజీ, బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్స్‌, షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్‌ పోర్టళ్లతో సంస్థ ఒప్పందం చేసుకోనుంది. హరిద్వార్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పతంజలి, ఈనెల 16న ఇక్కడ నిర్వహించనున్న కార్యక్రమంలో అన్ని పోర్టళ్ల ప్రతినిధులు పాల్గొంటారని అంచనా. బాబా రామ్‌దేవ్‌తో పాటు పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ కూడా హాజరవుతారు. ‘ఆన్‌లైన్‌ అమ్మకాలను భారీగా పెంచుకోవాలన్నది మా ప్రణాళిక. ఇప్పటివరకు కొన్ని ఉత్పత్తులు మాత్రమే ఆయా పోర్టళ్లలో లభిస్తున్నాయి. ఇకపై అన్ని ఉత్పత్తులను క్రమపద్ధతిలో అందుబాటులోకి తెస్తాం’ అని పతంజలి ప్రతినిధి ఎస్‌.కె.తిజారావాలా వెల్లడించారు. తమ ప్రవేశంతో ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల తీరే మారుతుందని పేర్కొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com