కాస్తయినా సరే.. లాభాలు


దేశీయ సూచీలు ఈ వారం కొద్ది స్థాయిలోనైనా సరే లాభాలనే నమోదు చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు మన మార్కెట్లలో ప్రతిఫలిస్తాయని చెబుతున్నారు. అయితే ఎటువంటి ప్రధాన వార్తలూ లేనందున సూచీలు చాలా వరకు ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చని అంచనా. జీడీపీ నాలుగేళ్ల కనిష్ఠానికి (6.5%) చేరడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చు. గురువారం ప్రారంభం కానున్న దిగ్గజ సంస్థల ఆర్థిక ఫలితాల వెల్లడి కూడా దిశానిర్దేశం చేయొచ్చు. సోమవారం నిఫ్టీకి 10490 వద్ద కీలక మద్దతు; 10600 వద్ద నిరోధం కనిపించొచ్చు. ఒక వేళ సూచీ 10600 స్థాయిని అధిగమిస్తే ఈ వారంలో 10800 వరకు పయనించొచ్చు. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌ సూచీలు లాభాలు కొనసాగించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు..
చమురు: చమురు శుద్ధి, రిటైలింగ్‌ కంపెనీలు ప్రతికూల ధోరణితో స్థిరీకరణకు లోనుకావొచ్చు. బలమైన మూలాల కారణంగా మధ్య నుంచి దీర్ఘకాలానికి ఈ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. సాంకేతికతంగా చూస్తే ఈ వారానికి మాత్రం కాస్త బలహీనతలున్నాయి. బీపీసీఎల్‌కు రూ.473 వద్ద మద్దతు; రూ.500 వద్ద నిరోధం; హెచ్‌పీసీఎల్‌కు రూ.396 వద్ద మద్దతు; రూ.432 వద్ద నిరోధం కనిపిస్తున్నాయి.
బ్యాంకింగ్‌: ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. అక్టోబరు-డిసెంబరు ఆర్థిక ఫలితాలపై మదుపర్లు కన్నేయనున్నారు. సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కర్ణాటక బ్యాంక్‌లు ఈ వారమే ఫలితాలు ప్రకటించనున్నాయి. ఎంపిక చేసిన బ్యాంకు షేర్లలో కొంత లాభాల స్వీకరణ జరగొచ్చని అంటున్నారు. ప్రభుత్వ మూలధన పునర్నిర్మాణ పథకం కింద మూలధనం పొందే బ్యాంకులపైనా మదుపర్లు కన్నేయవచ్చు.
వాహన: ప్రధాన వార్తలేమీ లేనందున చాలా తక్కువ శ్రేణికి పరిమితమై వాహన షేర్లు కదలాడవచ్చు. గ్రామీణ గిరాకీ బలంగా ఉండడంతో వాహన కంపెనీలు బలమైన ఆదాయాలు నమోదు చేయగలవన్న అంచనాలున్నాయి. ఈ వారం మారుతీ సుజుకీ రూ.9500ని అధిగమిస్తే.. రూ.9700-9800 స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. హీరో మోటోకార్ప్‌ రూ.3700-3840; టాటా మోటార్స్‌ రూ.425-440; టీవీఎస్‌ మోటార్‌ రూ.735-760 స్థాయిల్లో చలించొచ్చు.
సిమెంటు: మిశ్రమ ధోరణిలో కదలాడవచ్చు. ఏసీసీ, అంబుజా సిమెంట్‌లు హెచ్చుతగ్గులకు లోనవవచ్చు. అల్ట్రాటెక్‌ మాత్రం రాణించే అవకాశం ఉంది. ప్రభుత్వం మౌలిక రంగంపై ఎక్కువ వ్యయాలు చేస్తుందన్న అంచనాల మధ్య సిమెంటు కంపెనీలపై విశ్లేషకులు మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సానుకూలంగా ఉన్నారు. ఈ వారం ఏసీసీ రూ.1760-1835; అంబుజా సిమెంట్స్‌ రూ.266-284 మధ్య కదలాడవచ్చు.
ఎఫ్‌ఎమ్‌సీజీ: పెద్ద నోట్ల రద్దుకు ముందు స్థాయిలకు గిరాకీ చేరడంతో చాలా వరకు కంపెనీల విక్రయాలు రాణిస్తున్నాయి. నాలుగు త్రైమాసికాల పాటు స్తబ్దుగా ఉన్న ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల ఫలితాలు ఈ అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో రాణించొచ్చు. స్వల్పకాలంలో ఏషియన్‌ పెయింట్స్‌ రూ.1354 స్థాయికి చేరొచ్చు. హెచ్‌యూఎల్‌ రూ.1330-1380, ఐటీసీ రూ.261-264; డాబర్‌ ఇండియా రూ.354-370 మధ్య కదలాడవచ్చు.
ఐటీ: ఫలితాలకు ముందు ఈ రంగ కంపెనీలు చాలా తక్కువ శ్రేణికి పరిమతమై చలించొచ్చు. టీసీఎస్‌ ఫలితాలు గురువారం, ఇన్ఫీ ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఐటీ కంపెనీల అక్టోబరు-డిసెంబరు ఫలితాలు స్తబ్దుగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ సూచీకి 11800-12100 వద్ద నిరోధం; 11340-11500 వద్ద మద్దతు లభించొచ్చంటున్నారు. టీసీఎస్‌కు రూ.2750-2980 స్థాయిలో నిరోధం ఎదురుకావొచ్చని.. రూ.2540-2600 స్థాయిలో మద్దతు లభించొచ్చని అంటున్నారు. ఇన్ఫోసిస్‌కు మద్దతు, నిరోధ స్థాయులు వరుసగా రూ.980; రూ.1050 వద్ద ఉన్నాయి.
ఔఫధ: ఈ రంగ కంపెనీల షేర్లు లాభాలను కొనసాగించొచ్చు. అమెరికాలో చాలా ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, దేశీయంగా మెరుగైన వృద్ధి ఉన్నందున సానుకూలతలు కొనసాగుతాయని భావిస్తున్నారు. గతంలో ఫార్మా షేర్లు అధ్వాన పరిస్థితులు చూశాయి. ఇక పుంజుకుంటాయని విశ్లేషకులు అంటున్నారు. సన్‌ఫార్మా రూ.640 స్థాయి వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌లు సైతం లాభాలనే తెచ్చిపెట్టవచ్చని భావిస్తున్నారు.
యంత్ర పరికరాలు: విద్యుత్‌, మౌలిక రంగాల్లో సానుకూల సెంటిమెంటు కారణంగా యంత్ర పరికరాల షేర్లు లాభాలను అందుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం వెలువడే పారిశ్రామికోత్పత్తి సూచీ గణాంకాల కోసం ఈ రంగ షేర్లు ఎదురుచూస్తున్నాయి. రాబోయే కొద్ది వారాల్లో భెల్‌ రూ.109; థెర్మాక్స్‌ రూ.1250, సీమెన్స్‌ రూ.1310, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ రూ.95 స్థాయికి పెరిగే అవకాశం ఉంది. ఎల్‌ అండ్‌ టీ ఈ వారం రూ.1360 స్థాయి దిశగా పయనించొచ్చు.
లోహ: లోహ, గనుల కంపెనీల షేర్లు ఈ వారం సానుకూలంగా చలించొచ్చు. అటు ప్రాథమిక లోహాలు, ఇటు ఉక్కు ధరలు పెరగడం ఇందుకు నేపథ్యం. ముడి ఇనుము ధరలు పెరిగిన నేపథ్యంలో ఎన్‌ఎమ్‌డీసీపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. అయితే ఈ షేరుపై ‘కొనుగోలు’ నుంచి ‘అట్టేపెట్టి ఉంచుకోండి’కి సిఫారసును మార్పు చేసినట్లు ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com