ఎయిరిండియాను ప్రైవేటీకరించొద్దు


ఎయిరిండియాలో ప్రభుత్వ వాటా విక్రయించడానికి ఇది సరైన సమయం కాదని, ఆ సంస్థ పునరుద్ధరణకు కనీసం అయిదేళ్లు సమయం ఇవ్వాలని, ఆ సంస్థ రుణాలను మాఫీ చేయాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫారసు చేసింది. ఎయిరిండియా పునరుత్తేజం కోసం, విడతలుగా అందించిన సాయం వల్ల ప్రయోజనం కలగకపోగా, ఆ సంస్థ ఆర్థిక, నిర్వహణ సామర్థ్యంపై వ్యతిరేక ప్రభావం చూపాయని పేర్కొంది. అవసరాల కోసం అధిక వడ్డీకి రుణాలు తీసుకునేలా ఎయిరిండియాపై ఒత్తిడి ఏర్పడిందని వివరించింది. అందువల్లే ఎయిరిండియాపై రుణభారం పెరిగిందని తెలిపింది. దేశానికి గర్వకారణంగా నిలిచిన జాతీయ విమానయాన సంస్థలో వాటా విక్రయించకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని రవాణా, పర్యాటకం, సంస్కృతిపై నియమించిన స్థాయీసంఘం సూచించింది. ఇప్పుడు సంస్థను మూసివేసినా, ప్రైవేటీకరించినా, ఎంతమంది ఉపాధి కోల్పోతారో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరింది. ఉద్యోగుల ప్రయోజనాలు పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది.
ఉద్దీపన సమయంలో ఎందుకు?
జాతీయ అవసరాలకు తగినట్లుగా ఎయిరిండియా సేవలందిస్తోందని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, దేశీయంగా-అంతర్జాతీయంగా సామాజిక-రాజకీయ అనిశ్చితులు ఏర్పడిన సందర్భాల్లో, ఈ సంస్థ మాత్రమే వ్యాపార దృక్పథంతో వ్యవహరించక, ఆపదలో ఉన్న వారిని తరలించడంలో యథాశక్తి తోడ్పడుతోందని స్థాయీసంఘం ప్రశంసించింది. ఎయిరిండియాకు కల్పించిన ఆర్థిక ఉద్దీపన పథకం 2012 నుంచి పదేళ్ల పాటు 2022 వరకు అమలు కావాల్సి ఉందని గుర్తు చేసింది. ఇప్పటికే వివిధ అంశాల్లో ఆ సంస్థ పనితీరు మెరుగు పడుతోందని తెలిపింది. కార్యకలాపాలపై లాభాలు ఆర్జించే స్థితికి ప్రస్తుతం చేరిందని, అందువల్ల సంస్థ ప్రైవేటీకరణ ఇప్పుడు వద్దని వివరించింది. ఉద్దీపన ప్రణాళిక గడువు ముగిశాకే, ఎయిరిండియా ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభుత్వం మదింపు చేసి, అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిరిండియా శాట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అలయన్స్‌ ఎయిర్‌, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వంటివి ఇప్పటికే లాభాలు ఆర్జిస్తున్నాయని, వాటిల్లో ప్రభుత్వ వాటాను విక్రయించవద్దని స్థాయీసంఘం గట్టిగా సిఫారసు చేసింది.

రుణాన్ని రద్దు చేయాలి
ఎయిరిండియాపై పడిన రుణ భారం ప్రభుత్వ విధానాల ఫలితంగా ఏర్పడిందేనని, అందువల్ల ఆ రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయాలని విజ్ఞప్తి చేసింది. పునరుత్తేజానికి ఆ సంస్థకు కనీసం అయిదేళ్ల గడువు ఇవ్వాల్సిందేనని సూచించింది. ప్రభుత్వరంగ సంస్థ తరహాలో, కొద్దిపాటి ప్రభుత్వ నియంత్రణతో ఆ సంస్థ మనుగడ సాగించేలా చూడాలని కోరింది. ఒకవేళ ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పనిసరైతే, అధికారులు, సిబ్బందికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఆర్థిక, పౌరవిమానయాన శాఖలు సంయుక్తంగా వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com