హార్దిక్‌ ప్రదర్శన అదరహో...


బ్యాటుతో, బంతితో హార్దిక్‌ పాండ్య అద్భుత ప్రదర్శన చేశాడని.. తొలి టెస్టులో భారత్‌ ఆశలను నిలిపాడని చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. ‘‘అలాంటి ఇన్నింగ్స్‌ హార్దిక్‌ ఆడగలడని మాకెప్పటి నుంచో నమ్మకం ఉంది. అతడు ఆ ఇన్నింగ్స్‌తో ఆడడంతో డ్రెస్సింగ్‌రూమ్‌లో సానుకూల వాతావరణం వచ్చింది. హార్దిక్‌ చేసిన ఆ పరుగులు జట్టుకు ఎంతో ముఖ్యం. అవి మ్యాచ్‌లో మా ఆశలను సజీవంగా ఉంచాయి. హార్దిక్‌ ఆ ఇన్నింగ్స్‌ ఆడకపోయి ఉండుంటే మేం ఇబ్బందుల్లో ఉండేవాళ్లం. అతడు రెండు ముఖ్యమైన వికెట్లు కూడా పడగొట్టాడు. కాబట్టి అతడి ప్రదర్శన అసాధారణం’’ అని పుజారా చెప్పాడు. పాండ్య తొలి ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి మ్యాచ్‌లో భారత్‌ ఆశలు నిలిపిన సంగతి తెలిసిందే. ‘‘పాండ్య అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఇంతకుముందు విదేశాల్లో అతడు పెద్దగా టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. కానీ తుది జట్టులో ఉంటే అతడి నుంచి అలాంటి ఇన్నింగ్స్‌ ఆశిస్తాం. పాండ్య లాంటి ఆటగాడు ఉంటే జట్టు సమతూకంగా ఉంటుంది. పాండ్య ఈ ప్రదర్శనను కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం’’ అని పుజారా చెప్పాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా సహజశైలిలో షాట్లు ఆడడం పాండ్య స్వభావం. ఈ నేపథ్యంలో.. అతడు తన శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని పుజారా అభిప్రాయపడ్డాడు. ‘‘పాండ్య తన సహజ శైలిలో షాట్లు ఆడేందుకు ఇష్టపడతాడు. ఎలాంటి స్థితిలోనైనా అలాగే ఆడతాడు. అదే అతడి విజయ రహస్యం. శ్రీలంకపైనా అలాగే ఆడాడు’’ అని అన్నాడు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com