‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్‌ విడుదల


‘ధనం మూలం ఇదం జగత్‌.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం’ అంటున్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. సరదా సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు.

పూజారులుగా ఇక్కడ జీవితం సాగిస్తున్న బ్రహ్మనందం, ఆయన బృందంతో విష్ణు అమెరికాకు వెళ్దామని, అక్కడైతే డాలర్లు సంపాదించొచ్చని చెబుతారు. దీంతో అందరూ కలిసి అమెరికా వెళ్తారు. అక్కడ వారు ఎదుర్కొనే సంఘటనలను వినోదబరితంగా టీజర్‌‌లో చూపించారు. చివర్లో వచ్చిన యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.

జి నాగేశ్వరరెడ్డి ‘ఆచారి అమెరికా యాత్ర’కు దర్శకత్వం వహించారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. పద్మజా పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com