ఎంతో నేర్పిన ‘బ్లాక్‌ పాంథర్‌’


‘బ్లాక్‌ పాంథర్‌’ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ చిత్రంలో నేను ధరిస్తున్న ‘ఎరిక్‌ కిల్‌మాంగర్‌’ పాత్రలో నటించడం వల్ల నేను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను. ఆ చిత్రంలో పాత్ర కూడా నన్ను కొన్ని బ్లాక్‌స్పాట్స్‌కు తీసుకెళ్లింది. చిత్రం ఏమిటంటే, ఆ సినిమా చూసే ఎవరికైనా, ఆ సినిమాతో ఈజీగా కలిసిపోతారు’ అంటున్నారు మైకేల్‌ బి.జోర్డాన్‌. ‘బ్లాక్‌ పాంథర్‌’ చిత్రం వచ్చే నెలలో, అంటే ఫిబ్రవరిలో విడుదల అవుతుంది. ఈ ఏడాది వచ్చే చిత్రాలలో అత్యధికులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాలలో ‘బ్లాక్‌ పాంథర్‌’ రెండో స్థానాన్ని పొందుతోంది. మార్వల్‌ సిరీస్‌లో వస్తున్న ‘ఎవెంజెర్స్‌’:ఇన్‌ఫినిటీ వార్‌’ చిత్రానిది ఈ వరుసలో మొదటి స్థానం. ర్యాన్‌ కూగ్లర్‌ దర్శకత్వం వహించిన ‘బ్లాక్‌ పాంథర్‌’ చిత్రంలో మైకేల్‌తోబాటు ఫారెస్ట్‌ విటేకర్‌, లుపిటా న్యాంగో, డానాయ్‌ గురిరాలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రను సరిగ్గా నటించడానికి అనేక చిత్రాలలోని విలన్‌లను స్ఫూర్తిగా తీసుకున్నానని మైకేల్‌ జోర్డాన్‌ అంటున్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com