ఆ బయోపిక్‌ నుంచి తప్పుకుందా?


ఎయిర్‌హోస్టెస్‌ నీర్జాబానోత్‌ జీవిత కథతో వచ్చిన ‘నీర్జా’లో టైటిల్‌ పాత్ర పోషించి అందరిచేత సెభాష్‌ అనిపించుకొంది సోనమ్‌ కపూర్‌. ఈ సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. దీని తర్వాత మరో బయోపిక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది సోనమ్‌. ప్రముఖ భారతీయ క్లాసికల్‌ చిత్రకారిణి అమృత షెర్‌ గిల్‌ జీవిత కథలో సోనమ్‌ నటించడం ఖాయమైంది. పాత్ర కోసం షెర్‌ గిల్‌ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించింది సోనమ్‌. కానీ ఇప్పుడు ఈ చిత్రం నుంచి సోనమ్‌ తప్పుకున్నట్టు బాలీవుడ్‌ సమాచారం. ‘‘నేను ఆ పాత్రను చేయలేను’’అని ఓ సందర్భంలో చెప్పింది సోనమ్‌. ఆ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించవలసి రావడంతోనే సోనమ్‌ తప్పుకుందని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ విడుదల కోసం ఎదురుచూస్తోంది సోనమ్‌.
పెళ్లికబురు వేసవిలోనే?
అనుష్కశర్మ వివాహం విరాట్‌ కోహ్లీతో ఘనంగా జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో జరిగే పెళ్లి సోనమ్‌దే అంటున్నాయి హిందీ చిత్ర సీమ వర్గాలు. ఆనంద్‌ ఆహుజాతో కలిసి సోనమ్‌ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ఎప్పటి నుంచో సందడి చేస్తున్నాయి. పెళ్లి విషయంలో సోనమ్‌ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ‘‘సోనమ్‌ పెళ్లి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వేసవిలో జరగనుంది. ముఖ్యమైన అతిథుల మినహా పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదు’’అని సోనమ్‌ సన్నిహిత వర్గాలు అన్నట్టు సమాచారం.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com