‘అజ్ఞాతవాసి’ ట్రైలర్‌ వచ్చేసింది!


‘‘ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చని చెట్టును గొడ్డలితో పడగొట్టి.. రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి.. బెరడును బ్లేడుతో సానబెట్టి.. ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి... తయారు చేస్తారు. ఎంత హింస దాగిందో కదా! జీవితంలో మనం కోరుకునే ప్రతీ సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది.’’ అంటున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. త్రివిక్రమ్‌ దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు దీటుగా దీన్ని తీర్చిదిద్ది సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశారు.
కుర్చీ తయారు చేయడం వెనుక దాగి ఉన్న హింసను వివరిస్తూ పవన్‌ కనిపించారు. ‘వైలెన్స్‌ ఈజ్‌ నాట్‌ యాన్‌ ఆప్షన్‌’ అంటూ ఆది పినిశెట్టి కనిపించారు. పవన్‌ యాక్షన్‌తో పాటు త్రివిక్రమ్‌ శైలి హాస్యం కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంది. ‘కౌగిలించుకోలేదండీ! జస్ట్‌ పట్టుకున్నామంతే’ అంటూ పవన్‌ పలికే డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. ఇక ఆఫీస్‌లో పవన్‌ సైకిల్‌ ఎక్కి చేసే సందడి నవ్వులు పంచడం ఖాయం. చివర్లో మురళీ శర్మ ‘మళ్లీ సైకిలెక్కుతాడా వర్మా’ అని రావు రమేష్‌ను అడుగుతుంటే ‘వాడు ఏది ఎక్కినా పర్వాలేదు.. కానీ, మనల్ని ఎక్కకుండా ఉంటే చాలు’ అని అనడంతో పాటు ‘వాడి చర్యలు వూహాతీతం వర్మ’ అంటుంటే ‘దట్స్‌ ద బ్యూటీ’ అనే డైలాగ్‌ కితకితలు పెడుతోంది.


హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అమెరికాలో గతంలో ఏ భారతీయ చిత్రమూ విడుదల కాని స్థాయిలో ఏకంగా 209 లొకేషన్లలో ‘అజ్ఞాతవాసి’ విడుదల కానుండటం విశేషం.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com