అలా చేస్తే ఛార్జీలు పెరుగుతాయ్‌


విమాన ఛార్జీలపై పరిమితి విధించడం వల్ల టికెట్‌ ధరలు పెరుగుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు అభిప్రాయపడ్డారు. విమాన ఛార్జీలకు గరిష్ఠ పరిమితి నిర్ణయించాలని, టికెట్‌ రద్దు ఛార్జీలను ప్రాథమిక ఛార్జీలో 50 శాతానికి పరిమితం చేయాలన్న పార్లమెంటరీ కమిటీ సిఫారసులపై మంత్రి స్పందించారు. ముందస్తు బుకింగ్‌ ఛార్జీలతో పోలిస్తే, ప్రయాణ తేదీ సమీపించినపుడు టికెట్‌ ధరలను విమానయాన సంస్థలు పదింతల మేర పెంచుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ‘రవాణా, పర్యాటకం, సాంస్కృతికం’పై ఏర్పాటు చేసిన ఈ సంఘం సిఫారసు చేసింది. ‘ప్రతి ప్రాంతంలో విమాన టికెట్‌ గరిష్ఠ ధరను పౌర విమానయాన శాఖ నిర్ణయించాలని కమిటీ సిఫారసు చేస్తోంద’ని గురువారం రాజ్యసభకు సమర్పించిన నివేదిక చెబుతోంది. సాధారణ స్థాయి ధరల కంటే అధిక ధరలు నిర్ణయించడం అనేది కేవలం 1.7 శాతం కేసుల్లోనే జరుగుతోందని, పరిమితి పెడితే 98 శాతం కేసుల్లో టికెట్‌ ధరలు పెరుగుతాయని పార్లమెంటు బయట విలేకర్లతో గజపతి రాజు పేర్కొన్నారు. ‘భారత్‌లో ప్రస్తుతం ఉన్న విమాన టికెట్‌ ధరల విధానం అంతర్జాతీయంగా అనుసరిస్తున్నదే. మన విమానయాన సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు వ్యతిరేకంగా ఏమీ ప్రవర్తించడం లేద’ని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా పేర్కొన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలని తలిస్తే.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలను సంప్రదించవచ్చని సలహానిచ్చారు.
కనీస ప్రమాణాలు పాటించాలి: కమిటీ
పార్లమెంటరీ కమిటీ మాత్రం ‘అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ధరల విధానం భారత్‌ వంటి దేశానికి సరిపోదు. విమానయాన ఇంధన(ఏటీఎఫ్‌) ధరలు తగ్గినా.. ఆ ప్రయోజనాలను సంస్థలు ప్రయాణికులకు బదిలీ చేయలేద’ని అభిప్రాయపడింది. విమానాల రీషెడ్యూలింగ్‌, రద్దు, ఇతరత్రా వంటి అంశాల్లో కనీస ప్రమాణాలను పాటించడంలో ఎటువంటి ఏకరూపకత కనిపించడం లేదు. ప్రైవేటు విమానయాన సంస్థలు ఆకర్షణీయ ఆఫర్లతో విమాన టికెట్‌ విక్రయించినా, రద్దు చేసుకుంటే మొత్తం ధరను మినహాయించుకుంటున్నారు. రద్దు ఛార్జీలు టికెట్‌ మూల ధరలో 50 శాతం కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాల’ని సిఫారసు చేసింది. చెక్‌-ఇన్‌ విషయంలో ఎక్కువ సమయం పట్టి విమానం ఎక్కలేకపోయినా.. అదనపు రేట్లతో మళ్లీ టికెట్‌ బుక్‌ చేసుకోవల్సిందిగా బలవంతం చేస్తుంటారని కమిటీ విమర్శించింది.

ఇండిగో ప్రవర్తన సరికాదు: ఉద్యోగులు, ప్రయాణికుల పట్ల ఇండిగో సంస్థ ప్రవర్తనపై పార్లమెంటరీ స్థాయీ సంఘం మండిపడింది. అది సంస్థాగత సమస్య అని.. వినియోగార్లతో స్నేహపూరితంగా మెలగాలని సలహానిచ్చింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com