కేసరి షురూ!


వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించే సత్తా ఉన్న కథానాయకుడు అక్షయ్‌కుమార్‌. ప్రస్తుతం ‘ప్యాడమ్యాన్‌’గా సందడి చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త ఏడాదిలో మరో ప్రతిష్ఠాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ‘కేసరి’. ఈ సినిమా శుక్రవారం నుంచి మొదలైంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకొన్నాడు అక్షయ్‌. ‘‘కేసరిలో నా లుక్‌ను మీతో పంచుకోవడం గర్వంగా ఉంది. నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కొత్త ఏడాదిలో మొదలుకావడం మరింత ఆనందంగా ఉంది’’అని ట్వీటారు. తలపాగా, గుబురు గెడ్డం... తీక్షణమైన చూపులతో అక్షయ్‌ గెటప్‌ ఆకట్టుకునేలా ఉంది. 19 శతాబ్దంలో జరిగిన సారాగడి యుద్ధం నేపథ్యంలో సాగే చిత్రమిది. అనురాగ్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌తో కలిసి కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది హోలీకి ఈ సినిమాను విడుదల చేసే సన్నాహాల్లో చిత్రబృందం ఉంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com