సల్మాన్‌కు ఏమాత్రం తగ్గకుండా..!


కథానాయికలు నిత్యం గ్లామర్‌ మంత్రమే జపిస్తారు అనుకుంటాం. ఇప్పుడు వాళ్లూ రూటు మారుస్తున్నారు. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా డిష్యుం... డిష్యుం అంటూ ఫైటింగులకు సిద్ధమైపోతున్నారు. శ్రీలంక సుందరి జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఇప్పుడు అదే పనిలో ఉంది. ఆకట్టుకునే శరీరాకృతి ఉన్న బాలీవుడ్‌ భామల్లో జాక్వెలైన్‌ది ముందు వరసే. సల్మాన్‌తో ‘కిక్‌’లో అందాలతో కిక్కెంచింది. ఇప్పుడు ‘రేస్‌ 3’లో నటిస్తోంది. కాసిన్ని అందాలు ఆరబోసేస్తే చాలు అనుకోలేదు ఈ భామ. కండల వీరుడికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్‌ హంగామా చేస్తోంది. ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌, కిక్‌ బాక్సింగ్‌తో పాటు పలు యాక్షన్‌ విద్యల్ని నేర్చుకొంది. ‘‘ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయింది. అందులో జాక్వెలైన్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాలు వామ్మో అనేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సల్మాన్‌ చేసే పోరాట ఘట్టాలే కాదు జాక్వెలైన్‌ పంచ్‌ పవర్‌ ఏంటో కూడా ప్రేక్షకులు చూడబోతున్నారు. కచ్చితంగా జాక్వెలైన్‌ చేసే పోరాటాలు గురించి అందరూ మాట్లాడుకుంటారు’’అని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం ఈ భామ ఇండోనేషియాలో బాలీ దీవులో కుటుంబంతో విహారయాత్రను ఆస్వాదిస్తోంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com