అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను


అమెరికా అట్లాంటిక్‌ తీరాన్ని మంచు తుపాను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడం, తీవ్రంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తుపానును ‘బాంబ్‌ సైక్లోన్‌’గా పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంధనం సరఫరా చేసే పైపులతో సహా గడ్డకట్టుకుపోవడంతో తీవ్ర ఇంధన కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా ఈశాన్య, ఆగ్నేయ ప్రాంతాల్లో బుధవారం సంభవించిన పెను తుపానుతో పాటు గాలులు విపరీతంగా వీస్తుండడంతో దాదాపు 80వేల గృహాలు, వ్యాపార ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మసాచుసెట్స్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాన్ని కూడా మూసేశారు. నార్త్‌ కెరోలినా నుంచి మైనే వరకు తూర్పు తీరం వెంట ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 70మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని, దీని వల్ల విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. బోస్టన్‌లో 12 ఇంచుల మేర మంచు పేరుకుపోయినట్లు తెలిపారు. న్యూజెర్సీ నగరాన్ని కూడా మంచు కప్పేసింది. విపరీతమైన చలి, మంచు కారణంగా గత కొద్దిరోజులుగా 14 మంది మరణించారు. నార్త్‌కెరోలినాలో రోడ్డు ప్రమాదంలో నలుగురు, టెక్సాస్‌లో చలి కారణంగా ముగ్గురు మరణించారు. దాదాపు 5వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్‌ జాన్‌ కెన్నెడీ, లాగార్డియా విమానాశ్రయాల్లో అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com