ఇండో-చైనీస్‌ డ్రై చిల్లీ చికెన్‌


కావలసినవి
బోన్‌లెస్‌ చికెన్‌: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, ఆకుపచ్చ క్యాప్సికమ్‌: ఒకటి(చిన్నది), సోయాసాస్‌: టేబుల్‌స్పూను, వైట్‌ వినెగర్‌: పావుటీస్పూను, గ్రీన్‌ చిల్లీ సాస్‌: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: టీస్పూను, పచ్చిమిర్చి: మూడు, కాశ్మీరీ కారప్పొడి: 3 టీస్పూన్లు, వెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, మైదాపిండి: టేబుల్‌స్పూను, గుడ్డు: ఒకటి, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: తగినంత, ఉల్లికాడలు: కొద్దిగా
తయారుచేసే విధానం
* చికెన్‌ ముక్కల్లో అర టేబుల్‌స్పూను సోయాసాస్‌, గుడ్డుసొన, ఉప్పు, మిరియాలపొడి, మైదాపిండి, సగం వెల్లుల్లి ముద్ద, సగం చిల్లీ సాస్‌ వేసి కలిపి ఓ అరగంటసేపు నాననివ్వాలి.
* ఓ పాన్‌లో తగినంత నూనె పోసి చికెన్‌ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి మారేవరకూ వేయించి తీసి పక్కన ఉంచాలి.
* అదే పాన్‌లో మరికాస్త నూనె వేసి మిగిలిన వెల్లుల్లి ముద్ద, కాశ్మీరీ కారం వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి బాగా వేగాక వినెగర్‌ వేసి కలపాలి. తరవాత వేయించిన చికెన్‌ ముక్కలు వేసి మిగిలిన సోయాసాస్‌, గ్రీన్‌ చిల్లీ సాస్‌, ఉప్పు, పంచదార, మిరియాలపొడి వేసి కలిపి నాలుగైదు నిమిషాలు వేయించాలి. చివరగా ఉల్లికాడల ముక్కలు చల్లి దించి వేడివేడిగా వడ్డించాలి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com