పాక్‌కు మరో షాకిచ్చిన అమెరికా


పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే పాక్‌కు సైనిక సాయాన్ని నిలిపేసిన అమెరికా తాజాగా భద్రతా సహకారాన్ని కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటోందని, ఉగ్రవాద నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అమెరికా పాక్‌పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే పాక్‌కు 1.15బిలియన్‌ డాలర్ల సహకారాన్ని నిలిపేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.గత 15ఏళ్లుగా పాక్‌కు ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తుంటే వాళ్లు తమను మోసం చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి, వెంటనే ఆ దేశానికి 255మిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి రక్షణ విభాగం 900మిలియన్‌ డాలర్ల భద్రత సహకారాన్ని కూడా నిలిపేసింది. రెండూ కలిపి మొత్తం 1.15బిలియన్‌ డాలర్ల సహాయాన్ని అమెరికా ఆపేసింది.

పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆఫ్గాన్‌ తాలిబన్లు, హక్కాని నెట్‌వర్క్‌ తదితర ఉగ్రసంస్థలపై తగిన చర్యలు తీసుకునేంత వరకు పాక్‌కు ఆర్థిక, భద్రత సహకారాలు నిలిపేస్తామని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి హీతర్‌ వెల్లడించారు. పాక్‌ అండగా ఉంటున్న ఉగ్రవాదులు అమెరికా దళాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. పాక్‌కు ఇకమీదట మిలిటరీ పరికరాలు సహా భద్రతపరమైన ఎలాంటి సహకారం అందబోదని స్పష్టంచేశారు.


Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com