దీపిక బర్త్‌డే సర్‌ప్రైజ్‌: ‘పద్మావత్‌’ ఎప్పుడంటే..


బాలీవుడ్‌ ‘మస్తానీ’ దీపిక పదుకొణె ఈరోజు తన 32వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా దీపిక అభిమానులకు ఓ శుభవార్త. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘పద్మావతి’ సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది.
2017 డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల సీబీఎఫ్‌సీ పలు మార్పులు చేసి సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దాంతో ఈ సినిమా ‘పద్మావత్‌’ టైటిల్‌తో ఫిబ్రవరి 9న విడుదల అయ్యే అవకాశం ఉంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ కథానాయకులుగా నటించారు.
ఈ సినిమా తర్వాత దీపిక ‘సప్నా దీదీ’ అనే బయోపిక్‌లో నటించబోతున్నారు. ముంబయిలోని నాగ్‌పాడాకి చెందిన మాఫియా క్వీన్‌ రహీమా ఖాన్‌ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మరోపక్క ఈరోజు దీపిక పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు రణ్‌వీర్‌ సింగ్‌తో ఆమె నిశ్చితార్థం జరగనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com