సెలవులు అయిపోయాయ్‌


‘క్రిస్మస్‌ సెలవులు అయిపోయాయి... కొత్త సంవత్సరం సందడి కూడా ముగిసింది... మళ్లీ సెట్లోకి వచ్చేశాను... షరా మామూలుగానే పనిలో మునిగిపోయాన’ంటోంది ప్రియాంక చోప్రా. ఓ వైపు ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌, మరోవైపు హాలీవుడ్‌ చిత్రాలతో అమెరికాలో బిజీగా ఉంది ఈ భామ. కొద్ది రోజుల క్రితం క్రిస్మస్‌, కొత్త ఏడాది సంబరాల కోసం రెండు వారాలు విరామం తీసుకుని ఇండియాకు వచ్చింది. కుటుంబ సభ్యులతో ఎంచక్కా లండన్‌ వెళ్లి సెలవులను ఎంజాయ్‌ చేసింది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా న్యూయార్క్‌ విమానం ఎక్కేసింది. అక్కడ ల్యాండ్‌ అయిన వెంటనే మేకప్‌ వేసుకుని ‘క్వాంటికో’ సెట్లోకి అడుగుపెట్టింది. ఎముకలు కొరికే చలిలోనూ షూటింగ్‌లో పాల్గొంటోంది. ‘‘నేను మళ్లీ వచ్చేశాను. మూడు గంటలకు ల్యాండ్‌ అవడం, ఆరు గంటలకు సెట్లోకి రావడం... ఇదీ నా జీవితకథ’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ప్రియాంక. అంత బిజీలోనూ షాట్‌గ్యాప్‌లో అభిమానులతో ఫొటోలకు పోజిస్తూ ఆనందపరుస్తోందామె. ప్రస్తుతం ‘ఏ కిడ్‌ లైక్‌ జాక్‌’, ‘ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాల్లో నటిస్తోంది ప్రియాంక.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com