కొన్ని శాశ్వతంగా ఉండిపోవు: టబు


కొన్ని అనుభవాలు, జ్ఞాపకాలు శాశ్వతంగా మనతోనే ఉండిపోవు అని అంటున్నారు నటి టబు. ఈ ఏడాది ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించారు. ఏడాదికో సినిమా చేస్తూ వివిధ పాత్రలో నటిస్తున్న టబుకి విభిన్న పాత్రల్లో అలరించడం అలవడిందని అంటున్నారు.

‘ఒక పాత్రలో నటిస్తున్నప్పుడు మన ధ్యాస ఆ పాత్ర మీదే ఉండిపోతుందని చెప్పలేం. సెట్స్‌లో షూటింగ్‌ అయిపోయాక మన క్యారెక్టర్‌లోకి వచ్చేస్తాం. ఒక్కోసారి కేవలం మనం చేసిన పాత్రే కాదు తోటి నటులతో నటించినప్పుడు ఏర్పడిన జ్ఞాపకాలు కూడా మనతో పదిలంగా ఉంటాయి. కొన్ని శాశ్వతంగా ఉండకపోవచ్చు కూడా. బాలీవుడ్‌లో ‘బీవీ నెం.1’, ‘హేరా ఫెరీ’ తదితర చిత్రాల్లో నటించాను. ఆ రెండూ కామెడీ నేపథ్యంలో వచ్చినవే. దాంతో ఒకే తరహా పాత్రల్లో నటిస్తున్నానని కొత్తగా ప్రయత్నించాలని చాలా మంది దర్శకులు, అభిమానులు చెప్తుంటారు. ఏదన్నా కొత్తగా ప్రయత్నించడానికి ఇదే సరైన సమయం. అందుకే ఈ ఏడాది ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ సినిమాను ఎంపికచేసుకున్నాను. ఇందులో నా పాత్ర కేవలం కామెడీకే పరిమితం కాలేదు’ అని చెప్పుకొచ్చారు టబు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com