ఉన్నత స్థాయి హోదాకి... ఏఎఫ్‌క్యాట్‌


ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌), ఎన్‌సీసీ స్పెషల్‌ఎంట్రీ (ఫ్లయింగ్‌), మెటీరియాలజీ బ్రాంచ్‌ గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌) ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ఏటా రెండు సార్లు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షే ఏఎఫ్‌క్యాట్‌.

ఎంపిక ఇలా...
ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. టెక్నికల్‌ బ్రాంచ్‌కి దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి పైలట్‌ ఆప్టిట్యూడ్‌ బ్యాటరీ టెస్ట్‌ (పీఏబీటీ) నిర్వహిస్తారు. అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులను శిక్షణలోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి జనవరి, 2019 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ, దుండిగల్‌ (హైదరాబాద్‌)లో శిక్షణ మొదలవుతుంది. శిక్షణ సమయంలో రూ.56,100 స్టైపెండ్‌గా లభిస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు విధుల్లో చేరతారు.

రాత పరీక్షలో...
వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలడుగుతారు. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్లు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.

అర్హతలు
ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి.
గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌
విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రికల్‌ లేదా కమ్యూనికేషన్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌... తదితర విభాగాల్లో ఎందులోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు.
విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఏరోస్పేస్‌ లేదా ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మెయింటెనెన్స్‌ లేదా మెకానికల్‌ లేదా ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ వీటిల్లో ఏ విభాగంలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు.

గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌
ఈ బ్రాంచ్‌లో 4 ఉప విభాగాలున్నాయి. అవి..
అడ్మినిస్ట్రేషన్‌: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
లాజిస్టిక్స్‌: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అకౌంట్స్‌: 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎడ్యుకేషన్‌: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పీజీలో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, సైకాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం, పబ్లిక్‌ రిలేషన్‌, మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌...వీటిలో ఏదేని కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు, ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరితేది:జనవరి 23
వెబ్‌సైట్‌: www.careerairforce.nic.in

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com