గాల్‌ గడోట్‌కే ప్రథమస్థానం!


ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఎంతో పేరున్న ‘ఐఎమ్‌డిబి’ సంస్థ ‘తమ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది అత్యధిక ఆదరణ పొందిన తారల’ను ప్రకటించింది. చలన చిత్రాలను అభిమానించే వారికి ఐఎమ్‌డిబి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆ వెబ్‌సైట్‌ ప్రతీ ఏడాది, తమ వెబ్‌సైట్‌ ఆధారంగా అత్యుత్తమ ఆదరణ పొందిన తారలను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఏడాది, ఆ గౌరవం, గాల్‌ గడోట్‌కు లభించింది. ‘ఆమె వండర్‌వుమన్‌’గా అందరి మన్ననలూ పొందింది. మహిళాశక్తికి ఆమె నిదర్శనంగా నిలుస్తోంది. ‘కిందటేడాది ఆమె ఈ లిస్ట్‌లో ఆరో స్థానంలో ఉండేది. ఇప్పుడు మొదటి స్థానానికి రావటం ఆమె సామర్థ్యానికి నిదర్శనం’ అంటూ ఐఎమ్‌డిబి వారు గాల్‌ గడోట్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమె తర్వాత రెండో స్థానంలో టామ్‌ హార్డీ నిలిచారు. ఆయన ఈ ఏడాది ఏ చిత్రంలోనూ హీరోగా నటించకపోయినా, ‘డన్‌కిర్క్‌’ చిత్రంలో క్రిస్టోఫర్‌ నోలన్‌కు అసిస్టెంట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మూడో స్థానంలో ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ నటీమణి ఎమిలియా క్లార్క్‌, తర్వాత స్థానం ‘బేవాచ్‌’లో నటించిన అలెగ్జాండ్రా డడారియోలకు దక్కాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com