ఆటలో గెలిస్తేనే గండం గడుస్తుంది!


నలుగురు టీనేజీ కుర్రాళ్లు... వీడియో గేమ్‌ ఆడుతూ ఆడుతూ అనుకోకుండా అందులోని పాత్రల్లా మారిపోతారు. కన్ను మూసి తెరిచేలోపు ఆ గేమ్‌లో ఉన్న దట్టమైన అడవిలోకి వచ్చి పడతారు. మళ్లీ నిజమైన ప్రపంచంలోకి రావాలంటే ఆ అడవిలోని క్రూరమృగాలను ఎదుర్కొని గెలవాల్సిందే. లేదంటే ఎప్పటికీ ఆ గేమ్‌లోనే బందీగా ఉండిపోవాల్సిందే. వినడానికే ఆసక్తికరంగా ఉంది కదూ. మరి వారు గెలిచారో లేదో తెలియాంటే ‘జుమాంజి: వెల్‌కమ్‌ టు ది వరల్డ్‌’ చూడాల్సిందే. శుక్రవారం విడుదలవుతున్న ఆ చిత్ర విశేషాలివీ.
సరదాగా ఆట ఆడుతున్నవాళ్లు అందులో చిక్కుకుపోయే కథాంశంతో 1995లో ‘జుమాంజి’ వచ్చింది. అదే పేరుతో వచ్చిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. పిల్లలలో పాటు పెద్దల్నీ ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 65 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 263 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా నిలిచింది. 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘జుమాంజి: వెల్‌కమ్‌ టు ది వరల్డ్‌’ తెరకెక్కింది. డ్వేన్‌ జాన్సన్‌(ది రాక్‌) కథానాయకుడిగా నటించాడు. జాక్‌ బ్లాక్‌, కెవిన్‌ హార్ట్‌, కరెన్‌ గిల్లాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జేక్‌ కస్డన్‌ దర్శకత్వం వహించారు. 110 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథేంటి: నలుగురు హైస్కూల్‌ విద్యార్థులకు విహారయాత్రలో జుమాంజి అనే 20 ఏళ్ల నాటి పాత వీడియో గేమ్‌ దొరుకుతుంది. దాన్ని ఆడటానికి ప్రయత్నిస్తూ ఓ బటన్‌ నొక్కగానే విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అనుకోకుండా ఆ గేమ్‌లోని దట్టమైన అడవిలోకి వచ్చిపడతారు. తమ అసలు అవతారాలను వదిలేసి గేమ్‌లోని అవతార్‌లను ఎంచుకోవాల్సి వస్తుంది. పురాతత్వవేత్త, ప్రొఫెసర్‌, కమాండో, జంతుశాస్త్రవేత్త... ఇలా తమకు పరిచయం లేని మనుషులుగా మారిపోతారు. అప్పట్నుంచి ఆ అడవిలో రకరకాల క్రూరమృగాలు వారిపై దాడి చేస్తుంటాయి. ప్రకృతి బీభత్సాలు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను ఎదుర్కొని తమ ప్రాణాలు నిలుపుకోవడానికి వారు ఎలాంటి సాహసాలు చేశారన్నది కథ.

విశేషాలు
* ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలుపెట్టిన 2014లోనే తొలి ‘జుమాంజి’లో కథానాయకుడిగా నటించిన రాబిన్‌ విలియమ్స్‌ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ సినిమా నిర్మాణానికి చాలా మంది విముఖత వ్యక్తం చేశారు. అయితే డ్వేన్‌ జాన్సన్‌ ఆసక్తి కనబర్చడంతో ఎట్టకేలకు ఈ సినిమా తెరకెక్కింది.

* జుమాంజి థీమ్‌తో గతంలో ‘జుమాంజి: జతుర’ చిత్రం వచ్చింది. ఆట ఆడుతున్న పిల్లలు ఇంటితో సహా అంతరిక్షంలోకి ఎగిరిపోవడం ఆ చిత్రకథ.

* జుమాంజి కథను పోలిన కథతో ‘జతుర’ అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆట ఆడుతున్న పిల్లలు తమ ఇంటితో సహా అంతరిక్షంలోకి వెళ్లిపోతారు. అక్కడ గ్రహశకలాలు, గ్రహాంతర జీవులను ఎదుర్కొంటూ ఆటను కొనసాగించే తీరు ఆసక్తికరంగా ఉంటుంది.

* తాజా జుమాంజీ సినిమాలో అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కించడానికి బాగా కష్టపడినట్లు చిత్రబబృందం చెప్పింది. ఆ సన్నివేశాలను హవాయిలో చిత్రీకరించారు.

* ఈ చిత్రం అమెరికాలో ఈ నెల 20నే విడుదలైంది. అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com