ఉత్తరం ఉత్తమం


సంవత్సరానికి పన్నెండు నెలలు. నెలకు రెండు పక్షాలు. పక్షానికి ఒక ఏకాదశి. వెరసి ఏడాదికి ఇరవైనాలుగు ఏకాదశులు. ఒక్కో ఏకాదశికీ ఒక్కో పేరుంది. కానీ, వాటిలో వైకుంఠ ఏకాదశి చేరలేదు. దానికి కారణం. ఇతర ఏకాదశులన్నీ చాంద్రమాన (చంద్రుడి గమనం) గణన ఆధారంగా ఏర్పడినవి. వాటికి భిన్నంగా సౌరమాన (సూర్యుడి గమనం) గణన ఆధారంగా ఏర్పడిందీ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసం సూర్య గమనాన్ని బట్టి ఏర్పడుతుంది. మార్గశిరం-పుష్యం ఈ రెండింట్లో ఏదో ఒక మాసంలో వస్తుంది. అదైనా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశే వైకుంఠ ఏకాదశి అవుతుంది.
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు రావడం వెనుక వేర్వేరు కథనాలు పురాణాల్లో కనిపిస్తాయి. విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈరోజు తెరుస్తారని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడట. ఆ స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారని పురాణ కథనాలు.

ఉత్తర ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దీని వెనుకా అనేకమైన కారణాలు ఉన్నాయి. మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించుకుపోతుంటే.. వాటిని రక్షించడం కోసం మహావిష్ణువు వైకుంఠం నుంచి ఉత్తర ద్వారం గుండా వెళ్లాడని, మధుకైటభులను సంహరించి తిరిగి ఉత్తర ద్వారం గుండానే వైకుంఠంలోకి ప్రవేశించాడని చెబుతారు. ఆయన నడిచిన ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com